స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం

తమ్మినేని ప్రయాణిస్తున్న కారును ఢీకొని ఆటో బోల్తా

Tammineni Sitaram
Tammineni Sitaram

అమరావతి: ఏపి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొని ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. ఈరోజు మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్లారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/