సైన్యం నిర్బంధంలో గినియా దేశాధ్యక్షుడు

రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు ప్రకటించిన సైన్యం
సైనిక తిరుగుబాటుని తప్పుపట్టిన అమెరికా

గినియా : ఆఫ్ఘనిస్థాన్ లో ఇప్పటికే అంతర్యుద్ధం జరుగుతోంది. తాలిబన్లకు, తాలిబన్ల వ్యతిరేకులకు మధ్య పోరు జరుగుతోంది. ప్రజా జీవనం పూర్తిగా అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇదే సమయంలో మరో దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆఫ్రికాలోని గినియా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది.

గినియా దేశాధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజారంజకమైన పాలనను అందిస్తామని చెప్పారు. ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు సైనిక తిరుగుబాటుని అమెరికా తప్పుపట్టింది. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/