తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

కలెక్టర్లను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్ : తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/