పోప్ ఫ్రాన్సిస్‌తో ప్ర‌ధాని మోడీ భేటీ

రోమ్ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ రెండు రోజులుగా ఇటలీ రాజ‌ధాని రోమ్‌ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ వాటిక‌న్ సిటీకి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌ పోప్ ఫ్రాన్సిస్‌తో మ‌ర్యాద పూర్వ‌కంగా స‌మావేశ‌మ‌య్యారు. ఇవాళ ఇటలీ అధ్య‌క్ష‌త‌న రోమ్ న‌గ‌రంలో జీ-20 స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. గ్రూప్‌లో 20 దేశాల అధినేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. ఇటలీ ప్ర‌ధాని మ‌రియో డ్రాఘీ ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని మోడీ కూడా అక్క‌డికి చేరుకున్నారు.

వాటిక‌న్ సిటీకి వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తోపాటు జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ కూడా ఉన్నారు. వాటిక‌న్ సిటీ నుంచి రోమ్‌కు వ‌చ్చిన త‌ర్వాత జీ-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. అనంత‌రం రేపు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో న‌గ‌రంలో ప్రారంభ‌మ‌య్యే కాప్‌-26 స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. కాప్-26 స‌ద‌స్సు వ‌చ్చే నెల 12 తారీఖున ముగియ‌నుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/