చిరంజీవి వీరాభిమాని కన్నుమూత

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని చక్రధర్ కన్నుమూశారు. తమ అభిమాన హీరో చిరంజీవి బాటలోనే చక్రధర్ కూడా సమాజ సేవకు దిగి ఎంతోమందికి సేవ చేశాడు .చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేకమందికి సేవలు అందించారు కృష్ణాజిల్లా పెడనకు చెందిన చక్రధర్. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి హైదరాబాదుకు పిలిపించి మెరుగైన వైద్యం అందించి అప్పటికప్పుడు ప్రాణాలు కూడా నిలబెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న ..మళ్లీ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు.

మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉండి ఉండవచ్చు కానీ ఆయన కూడా ఎంతో అభిమానం చూపించే అభిమానులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ చక్రధర్ కూడా ఒకరు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటే వారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడమే కాదు వారు నిలదొక్కుకునే విధంగా కిరాణా షాపు చిన్న చిన్న హోటల్స్ కుదిరితే ఉద్యోగం లేదంటే ఏదో ఒక వ్యాపారం పెట్టించడానికి అండగా నిలబడేవారు. అలా చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ పేరు మీద ఉన్న ఎన్జీవోలో ఇతర హీరోల అభిమానులు సైతం సభ్యత్వం తీసుకునేలా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్లారు. అయితే ఆయన క్యాన్సర్ తీవ్ర రూపం దాల్చడం వల్ల కన్నుమూసినట్లు తెలుస్తోంది.