అఖండ నెల రోజుల కలెక్షన్స్..బాలయ్య అస్సలు తగ్గట్లే

అఖండ విడుదలై 30 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తూనే ఉంది. విడుదలై వారం రోజులు థియేటర్స్ లలో హౌస్ ఫుల్ నడవడమే గగనమైపోయిన ఈరోజుల్లో బాలకృష్ణ నటించిన అఖండ మాత్రం ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా డిసెంబర్ 02 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది.

తొలిరోజు నుంచే ‘అఖండ’ మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. విడుదలైన 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసిన అఖండ సినిమాకు 30వ రోజుకి గాను 10 లక్షల రూపాయల వరకు షేర్‌‌ వసూలైంది. 54 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి 16.82 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది.

30 రోజుల్లో ఏరియావైజ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాం- 19.93 కోట్లు
సీడెడ్‌- 15.09 కోట్లు
ఉత్తరాంధ్ర- 6.13 కోట్లు
ఈస్ట్ గోదావరి- 4.11 కోట్లు
వెస్ట్ గోదావరి- 4.06 కోట్లు
గుంటూరు- 4.68 కోట్లు
కృష్ణా- 3.56 కోట్లు
నెల్లూరు- 2.58 కోట్లు
ఆంద్రప్రదేశ్, తెలంగాణ కలిపి 60.14 కోట్లు(99.36 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా 5.00 కోట్లు
ఓవర్సీస్: 5.68 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 70.82 కోట్లు(124.85 కోట్ల గ్రాస్) సాధించింది.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని హిందీలో రీమేక్ కూడా చేయబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.