వైస్సార్సీపీ పార్టీ ఫై బిఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు

గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం..బిజెపి ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ సైతం దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ను విస్తరించాలని , బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. అందుకు గాను తమతో కలిసొచ్చే పార్టీలన్నింటిని కలుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బిఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి..ఏపీలోని రాజకీయాలపై , వైస్సార్సీపీ ,టీడీపీ పార్టీల తీరుపై విమర్శలు చేసారు.

ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని , అధికారంలో ఉన్న వైస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండు పార్టీల మద్దతు మోడీకే ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా ఏపీలో అడిగే పరిస్థితే లేదని విమర్శించారు. ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడే కేసీఆర్ వంటి నాయకుడు అవసరమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలని ఏపీలో కూడా చాలా మంది కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో అభివృద్ధి గురించి ఆలోచించే వారే లేరని… అక్కడ కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని అన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో ఏపీలో జరిగింది ఏమీ లేదని అన్నారు.