నిమ్మ తొక్కలతో చర్మసంరక్షణ

మేకప్ చిట్కాలు

Skin care with lemon skins
Skin care with lemon skins

అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు.

అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్నే కదా అని తీసిపారేయవద్దు. వాటిని మరోలా ఉపయోగించవచ్చు.

నిమ్మకాయ తొక్కలు అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఉయోగపడతాయి. బకెట్‌ నీళ్లలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయాలి.

నిమ్మతొక్కల్లోని సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట తిరిగి పనులు చేసే వారికి చర్మ వేడికి కమిలి దుమ్ము చేరుతుంది. అలసటకు కూడా గురవతుంటారు.

అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పొయి గుజ్జుతో ఫేసియల్‌ చేయడం అందరికీ తెలిసిందే. అయితే వీటి తొక్కలను కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని ప్యాక్‌గా వేసుకుని పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. డెడ్‌ స్కిన్‌ తొలగి చర్మం మెరుస్తుంది.

ఆపిల్‌ తొక్కలను కూడా మెత్తగా చేసి ముఖానికి పట్టించి, నెమ్మదిగా మర్దన చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజతొక్కలను సున్నిపిండితో మరపట్టించి వాడితే చర్మం మృదువుగా అవుతుంది.

తొక్కలను నీళ్లలో మరిగించి ఆ నీటితో స్నానం చేసే చర్మంలోని మలినాలు తొలగాపోతాయి. తొక్కల గుజ్జు నల్లని మచ్చలు, కంటికింద వలయాలు బాగా పనిచేస్తుంది.

నిద్ర నుంచి లేచినప్పుడు కొందరికి ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు బంగాళాదుంప తొక్కల్ని ఉడికించిన నీటిలో ముఖం కడుక్కుంటే మామూలుగా అవుతుంది. ఉడికిన తొక్కల్ని ప్యాక్‌గా వాడిఏ ముఖం మృదువుగా మారుతుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/