బాధ్యతల్ని ఆమోదించాలి

బాధ్యతల్ని ఆమోదించాలి
Couple

సమాన భాగస్వాములుగా ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాక, సంసార రథానికి ఇద్దరు రెండు చక్రాలు. ఇంధనం మాత్రం డబ్బే! ప్రపంచాన్ని చుట్టిరావాలన్ని, పచ్చటి పొదరిల్లు నిర్మించుకోవాలన్నా, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నా తగినంత సంపాదించుకోవాల్సిందే! అది ఒకరోజులోనో, ఒక ఏడాదిలోనో సాధ్యమయ్యేది కాదు. దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. కొత్త దంపతులు డబ్బు గురించి మాట్లాడుకోవడం తప్పేం కాదు. ఆస్తులూ, అప్పులూ, చేతిలోని డబ్బు, బ్యాంకులోని నిలువలు.. ఇలా సమస్తం చర్చించుకోవాలి.

తక్షణం వదిలించుకోవాల్సిన విద్యారుణాలు, వ్యక్తిరుణాలు వంటి విషయంలో సమష్టిగా ఓ నిర్ణయానికి రావాలి. కొత్త కుటుంబం కొత్త ఆర్థిక లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. ఇల్లు ఎప్పుడు కొనాలి. ఏ బడ్జెట్‌ అయితే భారంగా అనిపించదు. ఎక్కడ కొనాలి. అన్నది నిర్ధారించుకోవాలి. కొత్తకారు, విదేశీ యాత్రలు, కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చి పెద్ద చదువులకు వెళ్లడం. వగైరా లక్ష్యాల్ని ప్రాధాన్యాల వారీగా విభజించుకోవాలి. పెళ్లితో బాధ్యత పెరుగుతుంది. భావోద్వేగపరంగానే కాదు, ఆర్థికంగానూ ఆధారపడిన మనిషి ఒకరు ఉంటారిప్పుడు. రేపు పిల్లలు పుట్టాక, ఆ సంఖ్య పెరుగుతుంది. అనుకోని సంఘటనలు జరిగినా ఆ జీవితాలు వీధిన పడకూడదు.

ఇన్ని విషయాల్ని చర్చించుకున్నాక నెలవారి బడ్జెట్‌ మనసులోనే తయారయిపోతుంది. ఇక మిగులు డబ్బును ఏంచేయాలి అన్నది నిర్ణయించుకోవాలి. తక్షణ అవసరాలకు అత్యవసర నిధినీ ఏర్పాటు చేసుకోవాలి. జీవిత భాగస్వామి ఆర్థిక స్వభావం ఏమిటో అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టదు. చిన్నాపెద్ద బలహీనతలు ఉన్నా మొత్తంగా తన ఆర్థిక పరిజ్ఞానం ఎంత అన్నది తెలిసి పోతుంది. నొప్పించక, తానొవ్వక లోపా లుంటే సరిచేయడం వంటివి బాధ్యతా తీసు కోవాలి. సంపాదనలో ఇద్దరి మధ్య తేడాలు నప్పటికీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించాలి. బాధ్యతల్ని ఆమోదించాలి. ఆహా లకు, ఆధిపత్యాలకు చోటివ్వకూడదు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/