కరోనాపై అవగాహన అవసరం

తేలికగా తీసుకోవద్దు..అందరు సహకరించాలి

pawan kalyan
pawan kalyan

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ సూచనలు విధిగా పాటించాలని, దీనిపై ఎవరూ కూడా పట్టింపులకు పోవద్దని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనన్ని స్క్రీనింగ్‌ సెంటర్‌లను, ఐసోలేషన్‌ వార్డులను, ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్డాండ్‌లు, రైల్వే స్టేషన్ల్‌లో జాగ్రత్త చర్యలను చేపట్టాలన్నారు. దీనికోసం అన్ని పార్టిలు, స్వచ్చంద సంస్థలు, ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కరోనా నివారణ చర్యలపై జనసేన పార్టి శ్రేణులకు ప్రణాళక ఇచ్చామని, కరోనాని తేలికగా తీసుకోవద్దని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/