గ్రామీణ ఆడపిల్లలకు చేయూత

జీవన వైవిధ్యం

Chandrika
Chandrika

వాళ్లంతా తమ చిట్టిచిట్టి చేతులతో కేకులు చేశారు.బొమ్మలు గీశారు. అంతేకాదు పాల్గొని పరుగులూ తీశారు. ఇవన్నీ చేసి కొంత డబ్బు పోగేశారు.

అయితే ఆ డబ్బు వాల్లకోసం కాదు! పల్లెల్లో సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్న తమలాంటి బాలికలకోసం. చంద్రిక కనుమూరి ప్రారంభించిన ‘బాలమిత్ర సంస్థ ఇందుకు వేదికగా నిలుస్తోంది.

హైదరాబాద్‌లోని చిన్నారులు బొమ్మలు గీస్తే, సైక్లింగ్‌ చేస్తే.. విజయనగరం జిల్లాలోని పేద విద్యార్థి చదువు కునేందుకు కావాల్సిన పుస్తకాలు అందుతున్నాయి.

అమ్మాయిలకి కావాల్సిన ‘నెలసరి కిట్‌లు చేరుతున్నాయి. ఎంతోమంది పిల్లలకు ఉపకారవేత నాలు వెళ్తున్నా యి. ఇదంతా ఎలా సాధ్యమవుతోందంటారా..?

సామాజిక మార్పు కోసం పిల్లలే స్వచ్ఛంద కార్యకర్తలుగా మారి తోటి పిల్లల కోసం విరాళాలు అందిస్తున్నారు.

సైక్లింగ్‌, మారథాన్లు మ్యూజిక్‌ ఫెస్ట్‌లు, బేకింగ్‌ పోటీలూ.. వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన డబ్బుని బాలమిత్ర సంస్థ పల్లెల్లోని ఆడపిల్లల కోసం ఖర్చు చేస్తోంది.

ఆడపిల్లలకు అండగా.. చంద్రికకు ఇద్దరాడపిల్లలు. తల్లి అనుక్షణం వాల్ల ప్రగతి కోసం పరితపంచే ఆమెకు. తరచూ కొన్ని ప్రశ్నలు ఎదురయ్యేవి. ‘ మన పిల్లలు అన్ని సౌకర్యాలతో హాయిగా చదువుకుంటున్నారు.

మరి గ్రామీణ ప్రాంత చిన్నారుల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న ఆమె వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాతా. సమాధానం అంత తేలిగ్గా దొరకలేదు. సరికదా..

మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో వారికి సరైన సౌకర్యాలని అందించడం కోసం పిల్లల్లోనే స్ఫూర్తిని రగిలించాలనుకున్నారు చంద్రిక.

విజయనగరానికి చెందిన ఈమె.. బెంగళూరు యూనివర్సిటీలో బిఎ చదివారు.

ఆ తరువాత అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో ఎంబిఎ పూర్తిచేసి అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేశారు.

వివాహమై.. పిల్లలు పుట్టి కొన్నాళ్లకు కుటుంబంతో సహా ఇండియా వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

సామాజిక సేవపైన ఉన్న ఆసక్తితో చంద్రిక కొన్నాళ్లపాటు ‘నాంది పౌండేషన్‌తో కలిసి పని చేసింది.

ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలు నెలసరి సమయంలో ఉండే అసౌకర్యంవల్ల పాఠశాలలకు ఆరోజుల్లో వెళ్లడంలేదనీ, కొంతమంది పూర్తిగా చదువు మానేస్తున్నారనీ తెలిసి ఆందోళన చెందింది.

ఇందుకు పరిష్కారంగానే నాలుగేళ్ల కిందట ‘బాలమిత్ర ఫౌండేషన్‌ ప్రారంభించింది.

గ్రంథాలయాలతో మొదలు పెట్టి..

పిల్లలు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందాలంటే వాళ్లకు చదువొక్కటే సరిపోదు. ఆటపాటలు కూడా తోడవ్వాలి. బడి వాతావరణం చదువుపట్ల ఆసక్తిని పెంచేలా ఉండాలి.

ఇందుకుపల్లె బడుల్లో తగినన్ని క్రీడాపరికరాలు, గ్రంథాలయాలు తప్పని సరిగా ఉండాలని భావించిన చంద్రిక..

బాలమిత్ర ద్వారా పదిఏడేళ్లలోపు బాలికల్ని కార్యకర్తలు చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్లిలలంతా పల్లెల్లోని చిన్నారుల సమస్యలని అర్థం చేసుకున్నారు.

Distribution of kits to rural young women

అందుకే రెట్టించిన ఉత్సాహంతో మ్యూజిక్‌ ఫెస్ట్‌ను నిర్వహించడం, సైక్లింగ్‌లు మార్‌థాన్లు ఏర్పాటు చేయడం.. వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని పేదపిల్లలకు అందించడం మొదలు పెట్టారు.

‘ మొదటిసారి మేం సేకరించిన డబ్బుతో .. విజయ నగరం జిల్లా బిళ్లలవలస జిల్లా పరిషత్‌ హైస్కూల్లో లైబ్రరీని ఏర్పాటు చేశాం.

ఆ తరువాత మరో నాలుగైదు పాఠశాల ల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటుచేసి క్రీడా పరికరాలు, ఆర్ట్‌ కిట్లు వంటివి అందించాం’

మంచి మార్కులు సాధించినా పేదరికం కారణంగా చదువుకోలేక పోతున పేద విద్యార్థులను ఎంపిక చేసి పైచదువుల కోసం పదివేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందిస్తున్నాం అని తమ కార్యక్రమాల గురించి చంద్రిక చెబుతారు .

నెలసరి కిట్‌లు …

ఆడపిల్లల జీవితంలో నెలసరి సహజమైన విషయం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువులకి ఇదే ఆటంకమవుతోంది. ‘నెలసరి సమయంలో ఉండే అసౌకర్యం భరించలేక చాలామంది అమ్మాయిలు చదువుమానేస్తున్నారు.

ఇటువంటి వారికోసమే ఇటీవల ‘రన్‌ఫర్‌ ఏ బెటర్‌ ఫ్యూచర్‌ పేరుతో హైదరాబాద్‌లో ఒక మారథాన్‌ని నిర్వహిoచాం. కొవిడ్‌ కారణంగా ఈ మారథాన్‌ని వర్చువల్‌గా నిర్వహిచాం. ఇందులో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.

ఈ రన్‌ వల్ల ఆడపిల్లలకు నెలసరి కిట్‌ అందుతుందని చెప్పడంతో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు లక్షల రూపాయల వరకూ జమయ్యింది.

ఈ డబ్బు ఎనిమిది గ్రామాల్లోని ఆడపిల్లలకు శానిటరీ న్యాప్‌కిన్లు, లోదుస్తులు, యాంటీ బ్యాక్టీరియల్‌ సోప్‌లను కలిపి ఒక కిట్‌గా అందిస్తున్నాం.

మరో పది పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు క్రీడాపరికరాలు, ఆర్ట్‌కిట్స్‌ ఇవ్వడానికి ప్రణాళిక వేసుకన్నాం అని చెబుతారు చంద్రిక. పిల్లలకోసం పిల్లలే ముందుకు రావడాన్ని పెద్దలూ స్వాగతిస్తున్నారు.

తమ పిల్లలి ఇందులో భాగమయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. ఈకార్యక్రమానికి
పట్నం, పల్లెల్లోని 17 ఏళ్ల లోపు అమ్మాయిలు కమ్యూనిటీ మెంబర్స్‌గా, వాలంటర్లుగా కీలక పాత్రపోషిస్తున్నారు.

ఇప్పటివరకు 1500 మంది విద్యార్థులకు బాలమిత్ర ద్వారా సాయం అందింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/