సితార్ విద్వాంసుడు ‘పద్మభూషణ్’ దేవబ్రత మృతి
సంగీత ప్రపంచానికి 60 ఏళ్ల పాటు ఎనలేని సేవలు

New Delhi: ప్రముఖ సితార్ విద్వాంసుడు ‘పద్మభూషణ్’ గ్రహీత దేవబ్రత చౌదరి (85) కరోనా తో మృతి చెందారు. ఆయన కుమారుడు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేవబ్రత చౌదరికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆక్సిజన్ స్థాయి పడిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు. . శనివారం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. సంగీత ప్రపంచానికి ఆయన 60 ఏళ్ల పాటు విశేష సేవలందించారు. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/