యాంకర్ ప్రదీప్ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర యాంకర్‌లలో ప్రదీప్ మాచిరాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో మేటి యాంకర్‌గా ప్రదీప్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. ఇక వరుస టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు ఈ యంగ్ యాంకర్. ఇక ఇటీవల ప్రదీప్ హీరోగా కూడా మారి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా చేశాడు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే తాజాగా ప్రదీప్ మాచిరాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ కొద్ది నిమిషాల క్రితం మృతిచెందినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించడంలో మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ప్రదీప్‌కు కరోనా సోకిందని, దీంతో ఆయన చికిత్స చేయించుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ప్రదీప్ ఆ వార్తలపై స్పందించలేదు.

దీంతో ఇప్పుడు ప్రదీప్ తండ్రి పాండు రంగ కూడా కరోనా బారిన పడి చనిపోయి ఉంటారని పలువురు భావిస్తున్నారు. మరి ప్రదీప్ మాచిరాజు తండ్రి మరణానికి కరోనా కారణమా లేక ఇతర ఆరోగ్య సమస్యలు కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రదీప్ తండ్రి మరణ వార్త తెలుసుకున్న పలువురు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.