పవన్ కల్యాణ్‌ ఒక బచ్చా అంటూ వైసీపీ మంత్రి కామెంట్

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేతల మాటల యుద్ధం ఆగడం లేదు. వారం రోజులుగా పవన్ ఫై దాడి చేస్తూనే ఉన్నారు. గాంధీ జయంతి సందర్భాంగా పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భాంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.

గతంలో బీజేపీని పాచిపోయిన లడ్డు అన్నాడని, మాయావతి కాళ్లు కూడా పట్టుకున్నాడని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు 2024లో నేనే ముఖ్యమంత్రి అంటాడు అంటూ మండిపడ్డారు. ఇక, చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ ఒక బచ్చాగాడు అంటూ హాట్ కామెంట్లు చేసారు శ్రీనివాస్. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం పవన్ అంటూ మండిపడ్డారు. మంత్రి శంకర్‌ నారాయణ సైతం పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసారు. పవన్ పార్టీ పెట్టింది తన స్వలాభం కోసం… తన విలాసవంతమైన జీవితం గడపడం కోసమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.