సీఎం జగన్ పై దాడి చేసిన యువకుడు దొరికేసాడు

మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం లో ఉన్న సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ దాడి పై సిట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

దాడి సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీఎంపై పుట్ పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు తెలుస్తోంది. టైల్స్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.