మరోసారి బండి సంజయ్ కి సిట్ నోటీసులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసారు. పేపర్ లీకేజ్ ఘటన లో మంత్రి కేటీఆర్ దగ్గర ఉండే వ్యక్తుల పాత్ర ఉందనే ఆరోపణలు చేశారు బండి. ఈ క్రమంలోనే ఆధారాలు ఇవ్వాలంటూ.. సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులు అందజేశారు. 24వ తేదీ న సిట్ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందించారు. అయితే బండి సంజయ్ సిట్ ఎదుట హాజరుకాలేదు..సిట్ ఫై నమ్మకం లేదని , తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వనని, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని తెలుపడం జరిగింది. అలాగే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువల్ల తాను రాలేకపోయానని బండి సంజయ్ చెప్పడంతో.. మార్చి 25వ తేదీ మరో మరోసారి ఆయన ఇంటికెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.

ప్రస్తుతం TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓవైపు అభ్యర్థుల భవితవ్యం గందరగోళంలో పడిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇంకోవైపు సిట్.. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి ఈ కేసులో కీలక విషయాలు సేకరించింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ఎన్ఐఆర్లకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉంది.