కొవిడ్ ఆంక్షలు పొడిగింపు : కేంద్రం

డిసెంబర్ 31 వరకు కొవిడ్ గైడ్ లైన్స్ పొడిగింపు

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఒక్క కేసునమోదు కాకపోయినా.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (DM) చట్టం కింద జారీ చేసిన COVID-19 మార్గదర్శకాలను డిసెంబరు 31 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొడిగించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచే వచ్చే ప్రయాణికులను కచ్చితంగా కరోనా టెస్టులు చేయాలని కేంద్ర రాష్ట్రలకు సూచించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సాపింల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ కి పంపాలని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/