ముగిసిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అంత్య‌క్రియ‌లు

హైదరాబాద్ : ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. సిరివెన్నెల పెద్ద కుమారుడు యోగేశ్వ‌ర‌శ‌ర్మ ఆయ‌న చితికి నిప్పంటించారు. మ‌హాప్ర‌స్థానంలో సిరివెన్నెల అంతిమ‌సంస్కారాలు జ‌రిగాయి. సిరివెన్నెల పార్థివ‌దేహానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాల‌ళుల‌ర్పించారు. సిరివెన్నెల‌తో త‌మ‌కి ఉన్న అనుబంధాన్ని సెల‌బ్రిటీలు గుర్తు చేసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/