పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ రేవంత్ భార్య

సింగర్ రేవంత్ తండ్రియ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సింగర్ గా తెలుగు శ్రోతలను అలరించిన రేవంత్.. సూపర్ హిట్ సినిమాల్లో రేవంత్ ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 ఆఫర్ రావడం తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన భార్య అన్విత నిండు గర్భిణీ. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని చాలా సార్లు బాధపడ్డాడు రేవంత్.

ఇక హౌస్ లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం కూడా జరిగింది . ఆ వీడియోను హౌస్ లో ప్లే చేసి రేవంత్ ను హ్యాపీ చేశారు బిగ్ బాస్. చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని… తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని… అందుకే ‘నాన్నా’ అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. నాన్నా అని పిలిచేందుకు చిన్నారి ఆ ఇంట అడుగుపెట్టింది. తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని అంత మాట్లాడుకుంటున్నారు.