‘జీ20’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్‌

india-to-host-g20-2023-summit

న్యూఢిల్లీః జీ-20 అధ్యక్ష బాధ్యతలను మన దేశం చేపట్టింది. పోయిన నెలలో ఇండోనేసియాలో జరిగిన జీ-20 సదస్సులో అధ్యక్ష బాధ్యతలను ఇండియాకు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారికంగా జీ20 బాధ్యతలను మన దేశం స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జీ20 థీమ్ ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ స్ఫూర్తితో అందరినీ ఏకం చేస్తామని అన్నారు. టెర్రరిజం, క్లైమేట్ చేంజ్ వంటి సవాళ్లపై కలిసికట్టుగా పోరాడతామన్నారు. మానవాళి ప్రయోజనం కోసం అన్ని దేశాల మైండ్​సెట్ మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా ఆధ్వర్యంలో సమగ్ర, నిర్ణయాత్మక, ఆచరణతో కూడిన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన జీ20 యూనివర్సిటీ కనెక్ట్, ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ ప్రోగ్రాంలో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు.ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడంపై జీ20 దృష్టి పెడుతుందన్నారు.

కాగా, మన దేశం ఏడాది పాటు జీ-20 అధ్యక్ష పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. దేశంలోని100 స్మారక కట్టడాలపై ఈ లోగోను వారం పాటు ప్రదర్శించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/