మోహ‌న్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ

మోహ‌న్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ
హైదరాబాదులో బొత్స కుమారుడి పెళ్లి


హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, పూజితల వివాహానికి అన్ని రంగాల ప్రముఖులు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలు తరలి రాగా, ఈ పెళ్లి వేడుక ఆసక్తికర భేటీలకు వేదికగా నిలిచింది. బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని నటుడు మోహన్ బాబు నివాసానికి వెళ్లారు.

సినీ రంగ సమస్యలపై నిన్న సీఎం జగన్ తో సినీ ప్రముఖులు సమావేశం కాగా, ఆ భేటీ తీరుతెన్నులపై మోహన్ బాబుకు మంత్రి వివరించారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఆయనకు తెలియజేశారు. అయితే, సీఎంతో సమావేశానికి కొందరినే ఆహ్వానించడం, మా, ఫిలిం చాంబర్ తదితర వర్గాల నుంచి కూడా సీఎంతో సమావేశానికి పిలిస్తే బాగుండేదన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

కాగా, నిన్న సీఎం జగన్ తో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, అలీ భేటీ కావడం తెలిసిందే. సినిమా టికెట్ల ధరల సమస్యలకు ఈ భేటీతో దాదాపుగా తెరపడినట్టేనని భావిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/