సూపర్ స్టార్ కు జోడిగా పెళ్లి సందD బ్యూటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా ఇటీవల మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు జరగడం తో కొత్త షెడ్యూల్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

పెళ్లి సందD తో యూత్ ను కట్టిపడేసిన ఈ చిన్నది..ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా మూవీ లో నటించింది. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే సూపర్ స్టార్ మహేష్ పక్కన నటించే ఛాన్స్ కొట్టిసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ తొలి వారం నుంచి సెట్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ మూవీ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మాములుగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఐటెం సాంగ్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు, కానీ ఈసారి ఎందుకు ఐటెం సాంగ్ ప్లాన్ చేసినట్లు చెపుతున్నారు. ఈ ఐటెం సాంగ్ లో రష్మిక లేదా ఆ రేంజ్ హీరోయిన్ కోసం ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు చినబాబు నిర్మాత…నాగవంశీ నిర్వహణ.