దుబాయ్ లో అట్టహాసంగా జరిగిన సైమా అవార్డుల వేడుక

దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు నిన్న మొదటి రోజు గ్రాండ్ గా జరిగాయి. మొదటి రోజు తెలుగు, కన్నడ నటీనటులకు అవార్డులు అందుకున్నారు.

తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా జూ.ఎన్టీఆర్ అవార్డ్ (RRR).
ఉత్తమ హీరోయిన్ గా శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి(RRR)
ఉత్తమ సినిమాగా సీతారామం సినిమాలు ఎంపికయ్యాయి.

ఉత్తమ సహాయ నటుడుగా భీమ్లా నాయక్ సినమాలో నటించిన రానా దగ్గుపాటి అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా సంగీత(మసూద), ఉత్తమ విలన్ సుహాస్(హిట్-2), ఉత్తమ హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి(కార్తికేయ-2), ఉత్తమ డెబ్యూ ఆర్టిస్ట్ గా నటి మృణాళ్ ఠాకూర్, ఉత్తమ స్గీత దర్శకుడిగా కీరవాణి(ఆర్ఆర్ఆర్) లు అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (నాటు నాటు), ఉత్తమ గాయకుడిగా రామ్ మిర్యాల(డీజె టిల్లు) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అడవి శేష్, ఉత్తమ నటి(క్రిటిక్స్) మృణాల్ ఠాకూర్ లు అవార్డ్స్ అందుకున్నారు.