కాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశాలు మొదలుకాబోతుండగా..వివాదాస్పద పోస్టర్లు కలకలం

హైదరాబాద్ లో ఈరోజు , రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. తాజ్ కృష్ణ హోటల్లో జరగబోయే ఈ సమావేశాలకు ఖర్గే, సోనియా, రాహుల్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో పలు పోస్టర్లు అంటించడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ లు
హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్ లు పోస్టర్లగా అంటించారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ టాగ్ లైన్ తో వెలసిన పోస్టర్ లను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

పోస్టర్ లో ఉన్న CWC నేతల పేర్లు, వారి స్కాములు….

మల్లికార్జున ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కాం
సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం
మన్మోహన్ సింగ్ – కోల్ అలోకేషన్ స్కాం
రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
ఏకే ఆంటోనీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
చరంజిత్ సింగ్ చన్నీ – స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం
ప్రియాంక గాంధీ వాద్రా – నేషనల్ హెరాల్గ్ స్కాం,డీఎల్ఎఫ్ లాండ్ స్కాం,
అభిషేక్ మనుసింఘ్వీ – సీడీ రికార్డింగ్ స్కాం
జైరాం రమేష్ – కోల్ స్కాం
మహేంద్రజీత్ సింగ్ మాల్వియా –అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం
కేసీ వేణుగోపాల్ – సోలార్ స్కాం
అధిర్ రంజన్ చౌదరి – శారదా స్కాం
అంబికా సోని – రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం
అజయ్ మాకెన్ – రియల్ ఎస్టేట్ స్కాం
తామ్రద్వజ్ సాహు – ఆవు పేడ స్కాం
సల్మాన్ ఖుర్షీద్ – వీల్ చెయిర్ స్కాం
శశిథరూర్ – స్పాట్ ఫిక్సింగ్ స్కాం
మీరా కుమార్ – నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం
దిగ్విజయ్ సింగ్ – రిక్రూట్ మెంట్ స్కాం
చిదంబరం – ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కాం
లాల్ థన్ వాలా –మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం
ముఖుల్ వాస్నిక్ – ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం
ఆనంద్ శర్మ – వాల్ మార్ట్ స్కాం
అశోక్ రావ్ చవాన్ – ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం