గుండెపోటుతో దుండిగల్ ఎస్‌ఐ మృతి..

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. అంతలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఎలాంటి అనారోగ్యం లేని వారు ఎంతో హెల్తీగా, ఫిట్ గా ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.

తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రభాకర్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గతంలో హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన సీసీ టీటీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ఆ తర్వాత రాష్ట్రంలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు గుండెపోటుతో మరణించారు.