మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : హరిహర వీరమల్లు లో కనిపించబోతున్న అకిరా..?

మెగా అభిమానులకు గుడ్ న్యూస్..పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో పవన్ తనయుడు అకిరా కనిపించబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం 50 % షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర..కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుపెట్టుకోబోతుంది. అయితే, ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్‌ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్‌తో పాటు అకీరా కలిసి సీన్స్‌లో సందడి చేయనున్నారట.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తనయుడు అకీరా నందన్ కలిసి స్క్రీన్ మీద కనువిందు చేయబోతున్నారనే వార్త మరింత క్రేజ్ పెంచుతుంది.