ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్ట్. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని మాత్రం ఈడీ వ్యతిరేకించలేదు.

ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా.. అప్రూవర్‌గా మారాడు. మరోవైపు ఇటీవలే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా, మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.