శ్యామ్‌ సింగరాయ్‌ పబ్లిక్ టాక్..

వరుస పరాజయాలతో సతమతవుతున్న నేచురల్ స్టార్ నాని నటించిన తాజాగా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, సెబాస్టియన్ మడోన్నా హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి పాన్ ఇండియా గా నిర్మించారు. భారీ అంచల మధ్య ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియా లో కంటే ముందే యూఎస్ లో ప్రిమియర్స్ పడడంతో అభిమానులు , సినీ ప్రేక్షకులు సినిమా చూసి..వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పినదాని ప్రకారం సినిమా కు హిట్ టాక్ వస్తుంది.

నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ మూవీ లో నాని డ్యూయల్ రోల్ పోషించగా..ఆయన సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి పాన్ మూవీ గా నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, యూఎస్ లో ప్రిమియర్స్ చూసిన పబ్లిక్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరీ శ్యామ్ సింగరాయ్ గురించి వారు ఏమంటున్నారో చూదాం.

నాని – సాయి పల్లవి ల యాక్టింగ్ అదుర్స్…కృతిశెట్టి గ్లామర్ కేక..రాహుల్ డైరెక్షన్ సూపర్బ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్న..సెకండ్ హాఫ్ చాల బాగుందని చెపుతున్నారు. సెకండ్ హాఫ్.. వెస్ట్ బెంగాల్ లో ప్రారంభం అవుతుంది. ఇది శ్యామ్ సింగరాయ్ కథ. అక్కడ జరిగే కొన్ని అరాచకాలకు ఎదురు తిరిగే వ్యక్తి శ్యామ్ సింగ రాయ్. అందుకే తన ఇంటి నుంచి వెళ్లిపోయి.. ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటారు. అక్కడే దేవదాసి(సాయి పల్లవి)ని చూస్తాడు శ్యామ్. ఆలా ఆమెను ఇష్టపడతాడని..వీరిద్దరి మధ్య ప్రేమాయణం బాగుందని…ఇద్దరు కూడా బాగా నటించారని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం తో అభిమానులు , చిత్ర యూనిట్ సంతోహం వ్యక్తం చేస్తున్నారు.