ఓమిక్రాన్ బారినపడిన జెర్సీ హీరోయిన్

దేశ వ్యాప్తంగా కరోనా తో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో పాటు సినిమా హాల్స్ , షాపింగ్ మాల్స్ ను మూతవేసారు. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని , సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ కరోనా మహమ్మారి చిత్రసీమను మరోసారి వెంటాడుతుంది. ఇప్పటీకే పలువురు కరోనా బారినపడి మృతి చెందగా..కొంతమంది క్షేమంగా బయటపడ్డారు.

తాజాగా బాలీవుడ్ భామ..జెర్సీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓమిక్రాన్ బారినపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఐసోలేషన్ లో ఉందని తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణ లో ఆమెకు కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, విశ్వక్ సేన్ , తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇలా చాలా మంది ప్రముఖులు కరువు బారిన పడ్డారు. వీరంతా కూడా కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు.