రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి ..

రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకుంది. పాన్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ మూవీ రాధే శ్యామ్. 1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పలు భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గురువారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రామోజీఫిల్మ్ సిటీ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ క్రమంలో వేడుకలో అపశృతి చోటుచేసుకుంది.

ఈవెంట్ లో ఏర్పటు చేసిన కృష్ణం రాజు భారీ కటౌట్ పైకి ఎక్కి కొంతమంది అభిమానులు ఈవెంట్ ను చూస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఎక్కడం తో కటౌట్ కిందపడింది. దీంతో ముగ్గురు అభిమానులకు తీవ్ర గాయాలు కాగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలిసుల బందోబస్తు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం తో వారిని కంట్రోల్ చేయడం పోలిసుల వల్ల కాలేకపోయింది. ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించగా. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తుండగా.. భాగ్యశ్రీ , జగపతిబాబు , ప్రియదర్శి , సత్యరాజ్ , కునాల్ రాయ్ కపూర్ , సచిన్ ఖేడ్కర్ , మురళి శర్మ , ఎయిర్ టెల్ శాషా ఛత్రి , రిద్ది కుమార్ , సత్యన్ ఇతర పాత్రలు పోషించారు.