శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం భారీ అంచనాల మధ్య (డిసెంబర్ 24) న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ కు గాను డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25.28 కోట్ల గ్రాస్ ను .. 14.92 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, 20.80 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లు పెద్దగా తగ్గలేదు. మరో వారం రోజుల పాటు వసూళ్ల జోరు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మేకర్స్ అంటున్నారు.

విలక్షన కాన్సెప్టుతో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీకి 8వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 27 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది. ఇక ఈ మూవీ లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు.