ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కూలీలు మృతి

జార్ఖండ్‌: న్యూ ఇయర్‌ వేళ జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన పలాజు జిల్లాలోని హరిహర్ గంజ్ వద్ద చోటుచేసుకుంది.

జార్ఖండ్‌‌కు పొరుగు రాష్ట్రమైన బీహార్‌లోని హరిహరగంజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వరి కోసిన తర్వాత వారి గ్రామానికి వెళ్తున్న కూలీలతో నిండిన పికప్‌ వ్యాన్‌ను పెద్ద ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పికప్‌లో ఉన్న ముగ్గురు బాలికలతో సహా ఆరుగురు మృతి చెందారు. జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా మానిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వయ్య పాట్నా గ్రామానికి చెందిన 31 మంది కార్మికులు ఓబ్రాలోని సిహుడి గ్రామంలో వరి కోయడానికి వస్తున్నారు. వరి కోతలు ముగియడంతో కూలీలంతా పికప్‌ వ్యాన్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. హరిహరగంజ్ సమీపంలోకి కారు రాగానే సడన్ బ్రేక్ వేయడంతో కూలీలంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో వారిపై నుంచి వెనుక నుంచి వచ్చిన ట్రక్కు వెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/