షాకింగ్ న్యూస్ : ఆర్ఆర్ఆర్ వాయిదా..?

యావత్ సినీ ప్రేమికులకు షాకింగ్ న్యూస్..ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ 01 న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికాలో ఒకే రోజు మూడున్నర లక్షల కేసులు రావడం, మహరాష్ట్రలో కర్ఫ్యూ విధించడం, తమిళనాడు లో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రావడం, ఇప్పటికే ఢిల్లీలో ఆంక్షలు అమలులో వుండడం ఇలాంటి కారణాలు అన్నీ కలిసి ఆర్ఆర్ఆర్ ను వాయిదా దిశగా నడిపిస్తున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు వాయిదా వేయడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటి వరకు సాగించిన ప్రచారం మళ్లీ చేయాలి అంటే కనీసం పది నుంచి ఇరవై కోట్లు ఖర్చు వుంటుంది. అలాగే ఓవర్ సీస్ లో థియేటర్ పెనాల్టీలు కట్టాల్సి వుంటుంది. ఇవన్నీ ఆలోచించే ఆంధ్ర, సీడెడ్ బయ్యర్లకు 40శాతం డిస్కౌంట్ ఇచ్చి మరీ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు తమిళనాడు బయ్యర్ కూడా ఇదే మాదిరిగా యాభై శాతం డిస్కౌంట్ అడుగుతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.ఏది ఏమైనప్పటికి సినిమా వాయిదా పడడం అనేది నిర్మాతకు భారీ నష్టం అనే చెప్పాలి. మరి ఆర్ఆర్ఆర్ మాత్రమేనా రాధే శ్యామ్ కూడా వాయిదా పడనుందా అనేది చూడాలి