శుభ్‌మన్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తారు?

నెటిజన్‌ ప్రశ్నకు షారుఖ్‌ ఫన్నీ రిప్లై

shahrukh khan and shubman gill
shahrukh khan and shubman gill

ముంబై: బాలీవుడ్‌ కింగ్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) యజమాని షారుఖ్‌ ఖాన్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. క్రికెట్, యాడ్, షూటింగ్‌లలో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ రోజు విశ్రాంతి సమయంలో #AskSrk హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ముచ్చటించిన షారుఖ్‌ ఖాన్‌కు ఓ నెటిజన్‌ ప్రశ్నను సందించగా.. అదిరిపోయేలా సమాధానం ఇచ్చాడు. టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను కేకేఆర్‌ ఎప్పుడు కెప్టెన్‌ చేస్తుందని షారుఖ్‌ను ఓ ట్విట్టర్ యూజర్ (నెటిజన్‌) అడిగాడు. దీనికి స్పందించిన షారుఖ్‌.. ‘కేకేఆర్‌ నిన్ను హెడ్‌ కోచ్‌ చేసిన వెంటనే’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు ట్విట్టర్ యూజర్ మరో ప్రశ్న వేయలేదు. ప్రస్తుతం కేకేఆర్‌ జట్టు కోచ్‌గా మెక్‌కలమ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కేకేఆర్‌, షారుఖ్‌ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/