స్వీయ నిర్బంధం ఉల్లఘన !

ఇంటికే పరిమితం అయ్యా : మేరీకోమ్‌

Indian Starboxer Marycom

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని ఓపక్క క్రీడా సమాఖ్యలు, ప్రభుత్వాలు గొంతెత్తి చెపుతున్నా క్రీడాకా రులు మాత్రం కొన్ని చోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు.

ఇతర దేశాలనుంచి వచ్చే ప్రయాణీకులు స్వీయనిర్బంధంలో ఉండా లని ఆదేశించాయి.

కానీ ఆరుసార్లుప్రపంచ చాంపియన్‌, భారత స్టార్‌బాక్సర్‌ మేరీకోమ్‌ క్వారంటైన్‌ను పక్కనపెట్టి మరీ విందుకు హాజరయ్యారు.

జోర్డాన్‌లోని ఆమన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో పాల్గొన్న మేరీకోమ్‌ మార్చి 13న స్వదేశానికి తిరిగివచ్చింది.

ఇతర దేశాల నుంచి వచ్చినవారు 14రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న నిబంధనలమేరకు మేరీకోమ్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అయితేమ ఆర్చి 18న రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్‌కోవింద్‌ ఇచ్చిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.

విందు అనంతరం రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఫోటోలు పోస్ట్‌చేసారు. యుపి, రాజస్థాన్‌ పార్లమెంటుసభ్యులకు రాష్ట్రపతి కోవింద్‌ ఈ ఉదయం అల్పాహార విందును ఇచ్చారని కాప్షన ్‌రాసారు. ఫోటోల్లో మేరీకోమ్‌ కూడా ఉన్నారు.

దీనితో విషయం బయటకు పొక్కింది. తాను రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరయ్యానని మేరీకోమ్‌కూడా అంగీకరించారు.

అయితే జోర్డాన్‌నుంచి భారత్‌కు వచ్చినప్పటినుంచి తాను ఇంట్లోనే ఉన్నానని, రాష్ట్రపతి ఇచ్చిన అల్పాహార విందుకు మాత్రమే హాజరయ్యానని అన్నారు.

అక్కడ బజిఎపి సభ్యుడు దుష్యంత్‌ను కలవలేదని, కనీసం ఎవరితోను కరచాలనంచేయలేదని, మూడునాలుగు రోజులు తర్వాత ఇంటికేపరిమితం అయ్యానని ఇంట్లోనే ఉంటానని కూడా మేరీకోమ్‌ ప్రకటించింది.

బాక్సర్‌ మేరికోమ్‌ను 51కిలోల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో ఆమెకు టోక్యో బెర్తు ఖాయం అయింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ కాంస్యపతకం సాధించింది.

భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్‌పంఘాల్‌ 52కిలోలులోను, సిమ్రన్‌జిత్‌కెఔర్‌ 60 కిలోల విభాగంలోను, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

ఒలింపిక్స్‌కు భారత్‌తరపున తొమ్మిది మంది బాక్సర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2012 లండన్‌కు ఎనిమిది మంది క్వాలిఫై కావడమే ఇప్పటివరకూ రికార్డు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/