‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’!

Raana- Teja

చిన్న చిత్రాలతో పెద్ద దర్శకుడు అనిపించుకున్న ‘దర్శకుడు తేజ’ చాల సంవత్సరాల తరువాత రానాతో తీసిన ‘నేనేరాజు నేనేమంత్రి’తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లకి వచ్చాడు. అయితే ఆ తరువాత తీసిన ‘సీత’ సినిమాతో మళ్లీ ప్లాప్ ను ఎదురుకున్నాడు తేజ. అందుకే ఈ సారి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ తోనే మళ్ళీ మరో సినిమాతో రాబోతున్నాడు. హార్డ్ హిట్టింగ్ డ్రామాతో ‘రానా’ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/