కోల్‌కతా మీదుగా దక్షిణాఫ్రికాకు సఫారీ టీమ్‌

కరోనా వైరస్‌ కారణంగా మ్యాచ్ రద్దు

SA Cricket Team
SA Cricket Team

కోల్‌కత్తా: భారత్‌ దక్షిణాఫ్రికా జట్లమధ్య జరగాల్సిన మూడు వన్‌డేల సిరీస్‌ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగాశుక్రవారం రద్దయింది. సిరీస్‌ రద్దయినా సఫారీ క్రికెటర్లు ఇంకా భారత్‌లోనే ఉండాల్సి వస్తోంది. కరోనాబారిన పడకుండా క్రికెటర్లు ఇపుడు క్షేమంగా స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నారు.

ప్రస్తుతం సఫారీలు లక్నోలో ఉన్నారు. మంగళవారం కోల్‌కత్తానుంచి స్వదేశానికి తిరుగుప్రయాణం అవుతుందని క్యాబ్‌ అధ్యక్షుడు అభిషేక్‌ దాల్మియా చెప్పారు. ప్రొటీస్‌ ఆటగాల్లు సోమవారం కోల్‌కత్తాకు చేరుకునిమరసటిరోజు దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళతారు.

వీరిని క్షేమంగా పంపించేందుకు బిసిసిఐ అన్ని ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ప్రధాన కార్యదర్శికి కూడా ఈ అంశాన్ని తెలిపామని దాల్మియా వెల్లడించారు. కరోనాకారణంగా వన్‌డే సిరీస్‌ రద్దుకావడంతో సఫారీ ఆటగాల్లు లఖ్‌నవూనుంచి ముంబయి లేక ఢిలీ లరావడానికి కూడా భయపడ్డారు.

అందుకే ఎలాంటి వైరస్‌కేసులు నమోదుకాని కోల్‌కత్తాకు చేరారు. అక్కడినుంచి దుబా§్‌ుమీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాలనేది వారి ఆలోచన. సిరీస్‌రద్దుకావడంతో ఆటవిడుపుగా సఫారీలు ఆదివారం వాలిబాల్‌ ఆడారు.

కేంద్ర ప్రభుత్వం గ్యాలరీల్లోకి వీక్షకులు,ప్రేక్షకులను అనుమతించకూడదన్న నిర్ణయంతో మొత్తం వన్‌డే సిరీస్‌నే రద్దుచేసారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే దక్షిణాఫ్రికా భారత్‌సిరీస్‌ను నిర్వహిస్తామన్నారు. అందుకు క్రికెట్‌ దక్షిణాఫ్రికా సైతం అంగీకరించిందనితెలిసింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/