చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేవు

పౌరసత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చేది

Shashi Tharoor
Shashi Tharoor

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు తీసుకురావడం పూర్తిగా రాజకీయ కోణమే అని కాంగ్రెస్‌ సినీయర్‌ నేత శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. పౌరసత్వం ఇవ్వడంలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చేది. రాష్ట్రాలు ఆ పనిచేయలేవన్నారు. అందువల్ల వీటిని అమలు చేయడం చేయకపోవడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదన్నారు. సీఏఏను అమలు చేయబోమని చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేవు. అయితే ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీ ప్రక్రియ చేపట్టబోమని మాత్రం చెప్పొచ్చు. ఇక సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు తీర్మానాలు తీసుకొస్తున్నాయి. కోర్టులకు వెళ్తున్నాయి. నిజానికి అదంతా రాజకీయాల కోసం మాత్రమేనని శశిథరూర్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/