పుదీనా – పచ్చి బఠాణీ సూప్‌

రుచి: వెరైటీ వంటకాలు-

Mint - green pea soup
Mint – green pea soup

సూప్‌ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కూడా సూప్స్‌ ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో పుదీనా, పచ్చిబఠాణీ సూప్‌ ఒకటి. మరి ఇది ఎలా తయారుచేయవచ్చో చూద్దామా..

కావలసిన పదార్థాలు

ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్‌లు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, ఉప్పు – తగినంత, పచ్చిబఠాణీ – నాలుగు కప్పులు, వెజిటబుల్‌ స్టాక్‌ – నాలుగు కప్పులు, పుదీనా – ఒక కట్ట, లేత పాలకూర – ఒక కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌

Mint - green pea soup
Mint – green pea soup

తయారు చేయు విధానం

స్టవ్‌పై పాత్ర పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె బాగా వేడి అయ్యాక పుదీనా, పాలకూర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి.

పదినిమిషాల తరువాత పచ్చి బఠాఈ, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలియబెట్టాలి. మూత పెట్టి మరో పదినిమిషాల పాటు ఉడికించి దించాలి.

మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకుని కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ , మిరియాల పొడి చల్లాలి.

పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి. ఈ సూప్‌ రుచిగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని
పెంచుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/