పాపం రవితేజ.. అనుకున్నది ఒకటి అయ్యిందొకటి

చిత్రసీమలో ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..ఏ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అవుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావించిన సినిమా ప్లాప్ కావొచ్చు..ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చు. ప్రస్తుతం రవితేజ విషయంలో అదే జరిగింది. రవితేజ గతేడాది ‘ధమాకా’ సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఈ ఏడాది ఓపెనింగ్ కూడా హిట్టు తోనే మొదలు పెట్టాడు. బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించి మంచి మార్కులే కొట్టేశాడు. ఈ రెండు చిత్రాలు హిట్టవడంతో అతడి తర్వాతి చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యి షాక్ ఇచ్చింది.

సుధీర్ వర్మ డైరెక్షన్లో రవితేజ నటించిన రావణాసుర చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా కథే తనను నిలబెడుతుందనుకొని పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. సైలెంట్ గా వచ్చే హిట్టు కొట్టాలనుకున్నాడు కానీ ఈయనకు గట్టి దెబ్బే తగిలింది. ఏప్రిల్ 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ధమాకా, రావణాసుర చిత్రాల్లో రవితేజ వేసిన లెక్కలు తప్పినట్లు తెలుస్తోంది. రవితేజ సన్నిహిత వర్గాల ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే.. ధమాకా సినిమాపై ఆయనకు ఏమాత్రం అంచనాలు లేవట. సినిమా హిట్టవుతుందని కూడా రవితేజ అనుకోలేదట. కానీ ఆ సినిమా భారీ విజయం సాధించింది.

ఇక సుధీర్ వర్మ కంటెంట్ పై బలమైన విశ్వాసం కల్గిన రవితేజకు రావణాసుర గట్టి షాక్ నే ఇచ్చింది. ఏమవుతుందో అనుకున్న చిత్రం హిట్టవగా.. కచ్చితంగా హిట్టు కొడుతుందనుకున్న సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మరి టైగర్ నాగేశ్వర్ రావు ఏంచేస్తుందో అని అంత ఖంగారుపడుతున్నారు.