యాప్‌ల నిషేధంపై స్పందించిన చైనా

ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటన

Foreign Ministry Spokesperson Zhao Lijian’s 

బీజింగ్‌: కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయపై డ్రాగన్ దేశం స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటన చేశారు. యాప్‌లను నిషేధించిన విషయంలో అన్ని అంశాలను ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేయాలని మా దేశ వాణిజ్య, వర్తక సంస్థలకు చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చెబుతుంది. చైనా పెట్టుబడిదారులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/