మెగా డాటర్ కు ఫస్ట్ షాక్..

మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల..మెగా ప్రొడ్యూసర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోగా భారీ షాక్ తగిలింది. వెబ్ సిరీస్ లతో హిట్స్ అందుకున్న సుస్మిత..తాజాగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే చిత్రాన్ని నిర్మించింది. సంతోష్ శోభన్ – గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ డైరెక్షన్ చేసారు. ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళీ హిట్ మూవీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని మరీ ఈ మూవీని తెరకెక్కించారు.

అయితే ఈ మూవీ రొంటిన్ ప్రేమ కథ కావడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్ సార్ , కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకొని , సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తో ‘శ్రీదేవి శోభన్ బాబు’ ను చూసేందుకు ప్రేక్షకులు లేకుండా పోయారు. మొత్తం మీద వెండితెర ఫై భారీ హిట్ కొడతామని భావించిన సుస్మిత కు మొదటి సినిమాతోనే భారీ షాక్ తగిలినట్లు అయ్యింది.