ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో

ఇటీవల కాలంలో అగ్ర సంస్థల నుండి చిన్న చితక సంస్థల వరకు తమ ఉద్యోగులకు షాక్ ఇస్తూ వస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ లు లేవలేని సగం మందిని ఇంటికి పంపిస్తుండగా..మరికొన్ని సంస్థలు జీతాలను తగ్గిస్తున్నారు. ఇష్టమైతే చేయండి లేదంటే మానెయ్యండి అంటూ చెప్పేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను చూపుతూ ఐటీ కంపెనీలు వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించడం జరిగింది. మైక్రోసాఫ్ట్ నుంచి ట్విట్టర్ వరకు పలు కంపెనీలు లే ఆఫ్‌లతో ఉద్యోగులను హడలెత్తించాయి. తాజాగా, విప్రో టెక్నాలజీస్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కాకపోతే ఉద్యోగస్తులను తొలగించకుండా వారి జీతంలో కోత పెట్టింది.

అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో, క్లయింట్ల నుంచి ఆర్డర్ల రాక ఆలస్యం అవుతున్నందున.. తాము తొలుత ఆఫర్‌ చేసిన వార్షిక వేతన ప్యాకేజీని సగానికి పరిమితం చేస్తామంటూ చెబుతోంది. 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్‌ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని, 2023 మార్చి నుంచి రోల్స్‌లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది. అయితే వేతన ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని, విధుల్లో చేరాల్సిందిగా వాళ్లకు ఇ-మెయిల్‌ పంపింది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. కాగా, శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని ఇటీవల విప్రో ఇంటికి పంపింది. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతన తగ్గింపుతో షాకిచ్చింది.

x