చీరకట్టులో అదరగొడుతున్న ‘సార్’ బ్యూటీ

సార్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న సంయుక్త మీనన్ ..తాజాగా చీరకట్టులో ఫిదా చేస్తుంది. 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి, 2018లో ‘కలరి’ సినిమాతో తమిళ సినీరంగానికి పరిచమైంది సంయుక్త. భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సంయుక్త..ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు సార్ మూవీ తో హ్యాట్రిక్ కొట్టి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.ప్రస్తుతం అమ్మడికి ఛాన్సులు ఇచ్చేందుకు దర్శకులు , నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ఇదిలా ఉంటె సోషల్ మీడియా లోను సంయుక్త యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు , వీడియోస్ , ఫొటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. తాజాగా చీరకట్టులో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక సార్ మూవీ విషయానికి వస్తే..ధనుష్ – సంయుక్త జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన సార్ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.’జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్ .. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్’ అనే కాన్సెప్టును కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఆచరణలోకి తెచ్చారు. ఈ కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించేలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చరర్ చేసిన పోరాటమే ‘సార్’ సినిమా. ఇక సినిమా బాగుందనే టాక్ రావడం తో సినిమాను చూసేందుకు యూత్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పోటీపడుతున్నారు.

మూడు రోజుల్లో ఈ మూవీ 16.54 కోట్ల గ్రాస్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి రోజు 9.7 కోట్లు రాగా.. 2వ రోజు 11.6 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మూడవరోజు రెండు భాషల్లో కలుపుకొని అంతకు రెట్టింపు సాధించాయి. సార్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఒక విధంగా ధనుష్ కెరీర్ మొత్తంలో కూడా అత్యధిక థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమాగా సార్ రికార్డు క్రియేట్ చేసింది. ఏపీ తెలంగాణలో 450 కి పైగా థియేటర్లలో మొదట ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్య 500 దాటింది.