పవన్ కళ్యాణ్ ను కేఏ పాల్ తో పోల్చిన వైసీపీ ఎంపీ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు , కేఏ పాల్ కు పెద్ద తేడాలేదన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అంతే కాదు పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాలే బెటర్ అని , ఆయన మేధస్సే ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఏమైపోయినా పవన్ కు అనవసరమన్నారు.

బుధువారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి ఎంపీ నందిగం సురేష్‌లు పర్యటించారు. మార్టూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయడంతో పాటుగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాలే బెటర్ అని , ఆయన మేధస్సే ఎక్కువగా ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే బయటకు వస్తాడని సురేష్ అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని… ప్రజలు ఆనందంగా ఉండటాన్ని చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఓర్చుకోలేకపోతున్నారని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పేద వాళ్లందరూ ఎదగాలని జగన్ పని చేస్తుంటే… తన బినామీలు బాగుంటే చాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు.