హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఎన్ని బస్సులు ఉన్న ఇంకా ప్రయాణికుల పడిగాపులు తప్పవు. ఓ పక్క మెట్రో , మరో పక్క లోకల్ ట్రైన్స్ , క్యాబ్స్ , సొంత వాహనాలు ఇలా ఎన్ని ఉన్న బస్ స్టాప్ లలో మాత్రం పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు ల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఆ ఎదురుచూపులు తెరదించబోతున్నారు ఆర్టీసీ యాజమాన్యం. హైదరాబాద్ లో కొత్తగా 1020 సిటీ బస్సులను తీసుకరాబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 1020 సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది టిఎస్ఆర్టిసి.

ఈ కొత్త బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేయనుంది టీఎస్ఆర్టీసీ. గ్రేటర్ లో ఇప్పటికే పాత సిటీ బస్సులు 720 ఉండగా వాటిని తుక్కు కింద మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాతబడిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టిసి అధికారులు వెల్లడించారు.