అప్పుడే విష్ణు కు పెద్ద సమస్య వచ్చిపడింది

‘మా’ ఎన్నికల్లో భారీ విజయం సాధించి..మా పీఠం దక్కించుకున్న మంచు విష్ణుకు అప్పుడే వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఫలితాలు రాగానే మా సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసారు. ఈరోజు మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ రాజీనామా చేసారు. వీరిద్దరే అనుకుంటే..‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విష్ణు కు షాక్ ఇచ్చారు.

గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, నరేశ్ తప్పులు రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని.. ఇదంతా 15 రోజుల్లో నిజనిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకోకపోతే తానూ రాజీనామా చేస్తానని శివాజీరాజా అల్టిమేటం జారీచేశారు.మరోపక్క ప్రకాష్ రాజ్ తన మా సభ్వత్వాని యాక్సెప్ట్ చేయమని కోరగా..దానికి మంచు విష్ణు తొందరపడకండి అంటూ రిప్లయ్ ఇచ్చారు.

‘డియర్ అంకుల్ మీ అభినందనలకి థాంక్స్. కానీ మీ నిర్ణయానికి నేను బాధపడుతున్నాను. మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలుసు కదా.. గెలుపు, ఓటములు బొమ్మా, బొరుసు లాంటివని. దీన్ని కూడా మనం అలాగే తీసుకోవాలి. దాన్ని మీరు ఎమోషనల్ గా తీసుకోవద్దని కోరుతున్నాను. మా కుటుంబంలో మీరు కూడా సభ్యులే. నాకు మీ ఐడియాస్ కావాలి. మనిద్దరం కలిసి పనిచేద్దాం. మళ్లీ నాకు రిప్లై ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలోనే మిమల్ని కలుస్తాను. దీనిపై మనం చర్చిద్దాం. ఐలవ్ యూ అంకుల్ .. తొందరపడకండి. ’ అంటూ రిప్లై ఇచ్చారు