హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలకు పెద్ద టెన్షన్ తప్పింది

హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడవు ముగిసింది. అయితే ఈ ఉప ఎన్నికలో ఈటెల కు కొత్త టెన్షన్ వచ్చింది. అదేంటి అంటే నలుగురు రాజేందర్ లు బరిలోకి దిగడం. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు.
దీంతో ఓటర్లు ఏ రాజేందర్ కు ఓటు వేస్తారో అని ఈటెల భయపడుతూ వచ్చాడు. అయితే తాజాగా నామినేషన్ల పరిశీలన సమయంలో ముగ్గురు రాజేందర్ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రస్తుతం బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ బిగ్ రిలీఫ్ దక్కింది. పోలింగ్ సందర్భంగా రాజేందర్ పేర్లతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువైతే ఓట్లు నష్టపోయే అవకాశం ఉండేది. దీంతో ఈటెల రాజేందర్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఏర్పడింది. తాజా పరిణామంతో ఈటెల టెన్షన్ తగ్గినట్లు అయ్యింది.