శివరాత్రికి ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..?

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మార్చి 8న శివరాత్రి కానుకగా ఈ సినిమా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. రిలీజ్ డేట్ను కూడా అదే రోజు ప్రకటిస్తారని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మూడేళ్ళ క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి , ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు , వేరే సినిమాల షూటింగ్ లతో బిజీ గా ఉండడం తో ఈ సినిమా కు బ్రేక్ పడింది. త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మేకర్స్ చుస్తుహ్నరు. మొఘల్‌ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.