బిగ్ బాస్ 5 : షన్ను ఎంట్రీ ఇది..ఏం ఆట ఆడుతున్నవ్వురా..?

షార్ట్ ఫిలిమ్స్ ఫేమస్ షణ్ముఖ్ ..ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఓ సభ్యుడి గా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి మూడు వారాలు సైలెంట్ గా ఉన్న ఇతడు..ఐదో వారం లో నామినేషన్ లో ఉండడం..ఎక్కువ మంది ఇతడిని నామినేషన్ చేయడంతో ఇతడి అసలు రంగు బయటపెట్టాడు.

గ‌త రెండు రోజుల నుంచి హౌస్ లో మ‌న్నోడు చాలా తేడాగా క‌నిపిస్తున్నాడు. గొడవలకు చాలా దూరంగా ఉండే ష‌న్ను.. కావాల‌ని గొడ‌వ‌లు పడుతున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందో తెలియ‌కుండా .. జెస్సి విషయంలో ఇంటి కెప్టెన్ శ్రీరాంతో గొడవ పడ్డాడు. అంతేకాదు, ఇకపై అన్నం కూడా తినమని చెప్పారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. ఇంటి కెప్టెన్ శ్రీరామ్.. అందరూ తినే వరకూ తినకుండా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ బ్యాచ్ నిరాహార దీక్ష చేస్తుండడంతో అతడు కూడా తినకుండానే ఉన్నాడు. అయితే, ఉదయాన్నే లేచి వాళ్లు ముగ్గరూ కంచాలు పట్టుకుని కనిపించారు. అంతకు ముందు శ్రీరామ్.. షణ్ముఖ్ దగ్గరకు వచ్చి పలుమార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ‘నీకు 26 ఏళ్లు మాత్రమే. ఇదంతా అవసరమా’ అంటూ షణ్ముఖ్‌ను ఉద్దేశించి అన్నాడు శ్రీరామ్.

ఆ సమయంలో సిరి హన్మంత్ అతడిపై గొడవకు దిగి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిరి రూపంలో షన్ను కు ప్రమాదం పొంచి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చక్కగా ఆడేవాడిని తప్పుదోవ పట్టిస్తుందని.. అతడు కూడా ఆమెను గుడ్డిగా ఫాలో అవుతున్నాడని చాలా మంది అంటున్నారు. ఇదే జరిగితే షణ్ముఖ్ ఎలిమినేట్ అయినా అవ్వొచ్చని అంటున్నారు. మరికొంతమంది మాత్రం మొదటి వారం నుంచి ఇలాగే ఆడుంటే.. ఇన్ని నామినేషన్స్ పడవు కదా అంటూ షన్ను ఫై కామెడీ చేస్తున్నారు. ఒక్కసారి నామినేట్ అయితే.. ఇలా బిహేవ్ చేయ‌డ‌మేంటి ష‌న్ను అంటు కామెంట్లు చేస్తున్నారు. ష‌న్ను ఆట తీరు ఇలానే కొన‌సాగితే.. రెడ్ కార్డు వ‌ర‌కు వెళ్తుందంటూ వార్నింగులు వస్తున్నాయి. రెడ్ కార్డ్ అంటే ప్రేక్షకుల ప్ర‌మేయం లేకుండా హోస్ట్ తనకున్న అధికారంతో రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేయడం అన్నమాట.